7tv focus : రైల్లో ప్రయాణించిన ఆ జంట బెడ్ షీట్లను దొంగిలించింది. వాటిని తమ సూట్‌కేసులో దాచిపెట్టింది. ఆ మహిళ భర్త ఓ రైల్వేస్టేషన్‌లోని ప్లాట్ ఫాంలో బెడ్షీట్లను తీస్తుండగా ఓ వ్యక్తి గమనించి అదేంటని వారిని అడిగారు. దానికి ఆ వ్యక్తి భార్య మొరటుగా బదులిచ్చింది. రైల్లో తాము జర్నీ చేస్తుండగా.. టీసీ తమ నుంచి అదనంగా చార్జీ వసూలు చేశారని, అందువల్లే బెడ్షీట్లను తీసి తమ సూట్‌కేసులో పెట్టుకున్నామని చెప్పింది. ‘టీసీ అదనపు చార్జీ వసూలు చేసినంతమాత్రాన అలా చేయకూడదు’ కదా అని ఆ వ్యక్తి అడగగా ఆమె మళ్లీ అలాగే బుకాయించింది. వాస్తవానికి తాము ఆ బెడ్షీట్లను తిరిగి ఇస్తున్నామని పేర్కొంది.కాగా.. ఆ సమయంలో ఆ మహిళ భర్త నవ్వుతూ కనిపించాడు. వీడియో తీస్తున్న వ్యక్తిని వీడియో తీయడం ఆపాలని అతను రిక్వెస్ట్ చేశాడు. తర్వాత ఆ బెడ్షీట్లను ఆ మహిళ భర్త తిరిగి ఇచ్చేశాడు. వీడియో తీసిన వ్యక్తి దానిని ఎక్స్‌లో పోస్టు చేశారు. రైల్వే బెడ్షీట్లను ఓ జంట దొంగిలించిందని ఆయన క్యాప్షన్ రాశారు. ‘బెడ్షీట్లను దొంగిలించడమే కాకుండా నవ్వుతూ బుకాయిస్తున్నారు. వారు రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు. అయినా కూడా వారి ముఖాలపై ఏమాత్రం పశ్చత్తాపం లేదు’ అని వీడియో తీసిన వ్యక్తి ట్వీట్ చేశారు. తర్వాత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు యూజర్లు ఆ జంటపై విమర్శలు చేశారు.

