జెడ్పీహెచ్ఎస్ జీహెచ్ఎం సుధాకర్‌కు ఘనంగా వీడ్కోలు
కుత్బుల్లాపూర్, జూన్ 26, (7టీవీ ఫోకస్ ప్రతినిధి): విద్యార్థుల భవిష్యత్తు కోసం దశాబ్దాల పాటు అంకితభావంతో సేవలందించిన జీడిమెట్ల జెడ్పీహెచ్ఎస్ గెజిటెడ్ హెడ్మాస్టర్ శ్రీ ఎస్. సుధాకర్ పదవీ విరమణ సందర్భంగా పాఠశాలలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సహచర ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, పూర్వ విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరై ఆయన సేవలను కొనియాడుతూ భావోద్వేగపూర్వకంగా వీడ్కోలు పలికారు.హైదరాబాద్‌లోని జీడిమెట్ల జెడ్పీహెచ్ఎస్లో గెజిటెడ్ హెడ్మాస్టర్ శ్రీ ఎస్. సుధాకర్ పదవీ విరమణ సందర్భంగా ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. విద్యా రంగంలో ఆయన అందించిన విశిష్ట సేవలను గుర్తు చేసుకుంటూ పాఠశాల సిబ్బంది, విద్యావేత్తలు, పూర్వ విద్యార్థులు ఆయనకు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా గతంలో ఆయన పనిచేసిన జెడ్పీహెచ్ఎస్ మూసాపేట్ 2010 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు ప్రత్యేకంగా హాజరై తమ గురువుపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. హైకోర్టు న్యాయవాది, విఐపీ మానవ హక్కుల సంఘం జాతీయ డైరెక్టర్ మహమ్మద్ జహంగీర్ (మున్నా), మల్లికార్జున్‌తో పాటు పలువురు పూర్వ విద్యార్థులు సుధాకర్ మార్గదర్శకత్వం తమ జీవితాలను మలిచిందని పేర్కొంటూ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జీహెచ్ఎం ఆనంద్ జోషి, ఎస్ఏ మ్యాథ్స్ ఆర్. గోపాలకృష్ణన్, ఎస్ఏ సోషల్ ఆర్. గోపాల్, ఎస్ఏ ఫిజికల్ సైన్స్ అనిల్, ఎస్ఏ ఇంగ్లీష్ కె. దస్తయ్యతో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వక్తలు సుధాకర్ గారి పరిపాలనా నైపుణ్యం, క్రమశిక్షణ, విద్యార్థుల పట్ల ఉన్న అంకితభావాన్ని ప్రశంసించారు.

