7టీవీ ఫోకస్ విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ డి ఈ శ్రీనివాసులు గారిని కోరిన గుబ్బల లక్ష్మీనారాయణ… ఆలూరు వెంకట శేష చారి..విషయం:130 సుభాష్ నగర్ డివిజన్లోని ఎస్.ఆర్. నాయక్ నగర్ కాలనీలో తరచూ విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్న నేపథ్యంలో పాత విద్యుత్ లైన్ల స్థానంలో పవర్ కండక్టర్ (AB Cable) ఏర్పాటు చేయించి, ట్రాన్స్ఫార్మర్ల వద్ద క్రమం తప్పకుండా నిర్వహణ చేపట్టవలసిందిగా సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ గారు ఎస్సార్ నాయక్ నగర్ మాజీ ప్రెసిడెంట్ ఆలూరు వెంకట శేష చారి గారు విజ్ఞప్తి…వర్షాకాలం నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకావాలని D E గారిని కోరిన గుబ్బల లక్ష్మీనారాయణ.. ఆలూరు వెంకట శేష చారి..సుభాష్ నగర్ డివిజన్ 130ఎస్సార్ నాయక్ నగర్మా కాలనీలో కొద్దిపాటి గాలి లేదా వర్షం వచ్చినప్పుడల్లా విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. ప్రస్తుతం ఉన్న పాత మెటల్ వైర్లు చెట్ల కొమ్మలకు తగలడం వల్ల తరచుగా ఫాల్ట్‌లు ఏర్పడి గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. దీంతో కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ సమస్యను గతంలో కూడా మీ కార్యాలయం దృష్టికి తీసుకువచ్చాము. అప్పట్లో సమస్యను పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇవ్వబడింది. అయితే ఇప్పటికీ శాశ్వత పరిష్కారం లభించలేదు.అందువల్ల మా కాలనీలోని పాత విద్యుత్ లైన్లను తొలగించి, నాణ్యమైన పవర్ కండక్టర్ (AB Cable) ఏర్పాటు చేయించవలసిందిగా మనవి చేస్తున్నాము. అలాగే ట్రాన్స్ఫార్మర్ల వద్ద క్రమం తప్పకుండా నిర్వహణ (Maintenance) చేపట్టేందుకు సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయవలసిందిగా కోరుతున్నాము. సరైన నిర్వహణ లేకపోవడం వల్ల కూడా విద్యుత్ అంతరాయాలు ఎక్కువగా జరుగుతున్నాయి.కావున మా కాలనీ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వీలైనంత త్వరగా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి, నిరంతర విద్యుత్ సరఫరా అందేలా తగిన చర్యలు తీసుకోవాలని వినమ్రంగా ప్రార్థిస్తున్నాము.ఈ కార్యక్రమంలో కామేశ్వర శర్మగారు, కిషోర్ గారు పాల్గొన్నారు.

