
విషయం: లాల్సాహెబ్గూడ ఫేజ్–IIలో నీటి సరఫరా పైప్లైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయించవలెనని వినతి.

మేము కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని లాల్సాహెబ్గూడ ఫేజ్–II నివాసితులము. మా కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించుటకు నూతన 200/150/100 MM DI K7 వాటర్ సప్లై ఫీడర్ మరియు డిస్ట్రిబ్యూషన్ లైన్ల ఏర్పాటు కొరకు గతంలో నవజ్యోతి యూత్ అసోసియేషన్ తరఫున వినతిపత్రం సమర్పించబడినది. ఆ వినతిపై స్పందించి, మీ చొరవతో HMWS&SB అధికారులు రూ.69,00,000/- అంచనా వ్యయంతో ప్రతిపాదన సిద్ధం చేసి, 23-03-2024 తేదీన పరిపాలనా అనుమతుల కోసం సమర్పించినట్లు మాకు తెలిసినది.అయితే, ప్రతిపాదన సిద్ధమై చాలాకాలం గడిచినప్పటికీ ఇప్పటివరకు పనులు పూర్తి కాలేదు. దీంతో మా కాలనీ ప్రజలు ఇప్పటికీ తాగునీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవి కాలంలో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోంది.అందువల్ల, ఇప్పటికే ఆమోదం కోసం పంపిన ఈ నీటి సరఫరా పైప్లైన్ పనులకు అవసరమైన చర్యలు తీసుకొని, సంబంధిత అధికారులను ఆదేశించి పనులను వీలైనంత త్వరగా ప్రారంభించి పూర్తి చేయించవలసిందిగా వినయపూర్వకంగా కోరుచున్నాము.మీ చొరవతో ఈ ప్రజా సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాము.
ధన్యవాదములతో,ఇట్లు మీ విధేయులు,లాల్సాహెబ్గూడ ఫేజ్–II నివాసితులు,కుత్బుల్లాపూర్ నియోజకవర్గం

