జంగారెడ్డిగూడెం 7 టివి ఫోకస్ జూలై 9
గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి పుణ్యక్షేత్రంలో కోటి ఇరవై లక్షలు రూపాయల నిధులతో నిర్మించిన శ్రీరామ సదన్ భవన సముదాయాన్ని చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ భక్తుల సౌకర్యార్థం లాంఛనంగా ప్రారంభించారు భక్తులకు మెరుగైన వసతి కల్పించే ఉద్దేశంతో ఎనిమిది గదులతో నిర్మించిన ఈ శ్రీరామ సదన్‌ను ప్రారంభించిన అనంతరం ఆలయ అభివృద్ధికి విశేష సహకారం అందించిన దాతలకు శాసనసభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు

వారి సేవాభావాన్ని కొనియాడుతూ శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని శాసనసభ్యులు పేర్కొన్నారు ఈ భవనం ద్వారా ఆలయానికి విచ్చేసే భక్తులకు మరింత మెరుగైన వసతి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ చందన ఆలయ కమిటీ చైర్మన్ కమిటీ సభ్యులు కూటమి నాయకులు కార్యకర్తలు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

