7tv focus : జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా.. జర్నలిస్టు నిధి రజ్దాన్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ పెళ్లిపై మతపరమైన వివాదం నెలకొన్నది. ఆల్ ఇండియా ముస్లిం జామత్ అధ్యక్షుడు మౌలానా ముఫ్తీ షాహబుద్దిన్ రజ్వీ బరేల్వీ ఆ పెళ్లి చట్ట వ్యతిరేకం అన్నారు. ఇస్లామిక్ సూత్రాలకు అనుగుణంగా ఆ పెళ్లి జరగలేదన్నారు. షరియత్ చట్టం ప్రకారం పెళ్లి చేసుకున్న ఇద్దరూ ముస్లిం వ్యక్తులై ఉండాలని, ఇది ఇస్లామిక్ సూత్రాలకు విరుద్ధంగా జరిగినట్లు రజ్వీ తెలిపారు. ఒమర్ అబ్దుల్లా ముస్లిం కాగా, రజ్దాన్ ముస్లిం కాదన్నారు. ఆ కారణంగా సీఎం ఒమర్ పెళ్లికి ఇస్లామిక్ సూత్రాల ప్రకారం అనుమతి లేదన్నారు.నిఖా కన్నా ముందే రజ్దాన్ ముస్లిం మతాన్ని స్వీకరించి ఉంటే అప్పుడు ఆ పెళ్లికి విలువ ఉండేదన్నారు. మతం మార్చుకుని, ఇస్లామిక్ సంప్రదాం ప్రకారం పెళ్లి చేసుకుని ఉంటే దానికి అనుమతి ఉండేదన్నారు. ఇస్లామిక్ మతంలో పెళ్లి విషయంలో ప్రత్యేకమైన రూల్స్, షరతులు ఉన్నాయన్నారు. పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తె కచ్చితంగా ముస్లిం వ్యక్తులై ఉండాలన్నారు. ఒకవేళ ఎవరైనా ముస్లిం కాని పక్షంలో, ఆ పెళ్లి చట్టబద్ధం కాదన్నారు. అందుకే ఆ పెళ్లిక అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు రిజ్వీ తెలిపారు. రజ్దాన్ ఇస్లాం మతాన్ని స్వీకరించలేదు కాబట్టి, ఆ కలయిక ఇస్లాం చట్ట వ్యతిరేకం అవుతుందన్నారు.జర్నలిస్ట్ నిధి రజ్దాన్‌తో కొత్త ప్రయాణం మొదలుపెట్టనట్లు ఒమర్ అబ్దుల్లా శనివారం పేర్కొన్నారు. నిధితో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన షేర్ చేశారు. నిన్నటి నుంచి కొత్త ప్రయాణం ప్రారంభమైందన్నారు. ఒమర్ అబ్దుల్లాకు దూరంగా ఉంటున్న భార్య పాయల్‌కు విడాకులు మంజూరు చేసేందుకు జూలై 31న సుప్రీంకోర్టు అంగీకరించింది. ఇద్దరూ పరస్పర అంగీకారంతో వివాహ బంధాన్ని ముగించుకోవాలని నిర్ణయించుకున్నట్లు కోర్టుకు తెలిపారు. తమ మధ్య ఉన్న వివాదాలను పరిష్కరించుకోవడంతోపాటు, ఒకరిపై మరొకరు దాఖలు చేసిన కేసులను ఉపసంహరించుకోవడానికి అంగీకరించారు

