7 టీవీ ఫోకస్ కాంగ్రెస్ శ్రేణులంతా క్షేత్ర స్థాయిలో పని చేయాలిపార్టీ శ్రేణులకు నర్సారెడ్డి భూపతిరెడ్డి పిలుపుసీఎం రేవంత్ రెడ్డి గారు, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బౌరంపేట్ డివిజన్ (295) కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు అర్కల విజయ్ గౌడ్ ఆధ్వర్యంలో డివిజన్ కో ఆర్డినేటర్లు, బూత్ కో ఆర్డినేటర్లతో నిర్వహించిన “సర్ (SIR)” ప్రత్యేక సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి గారు.ఈ సందర్బంగా నర్సారెడ్డి భూపతిరెడ్డి గారు మాట్లాడుతూ అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు జాబితా తొలగించకుండా చూడాలని పేర్కొన్నారు. బీఎల్ఓలతో మన పార్టీ బీఎల్ఏలు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగేలా నాయకులు చూడాలని సూచించారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా ఓటర్ల జాబితా నుంచి తొలగిపోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఎస్ఐఆర్ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం ఉండొద్దన్నారు.
కాంగ్రెస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో SIR పై అవగాహన సమావేశాలు నిర్వహించి, ఓటర్లకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు.SIR ప్రక్రియను పార్టీ అత్యంత కీలక అంశంగా పరిగణించిందన్నారు.SIR ప్రక్రియ తుది దశలో ఉందన్నారు. ఇదే అత్యంత కీలకమన్నారు. ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫారాలను తీసుకుని ఆన్ లైన్ చేసేంతవరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నర్సారెడ్డి వీరారెడ్డి గారు,జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు సదానందం,నర్సారెడ్డి బాల్ రెడ్డి,బేంబడి హనుమంత్ రెడ్డి,వెంకట్ రెడ్డి,శామీర్పేట్ ప్రకాష్ రావు, పోచి మహేష్,మన్నే కుమార్,యాదగిరి,సాల్మన్ రాజు, పోచంపల్లి బాలరాజు,బైండ్ల దయానంద్,కోటేశ్వరరావు, , వెంకట్ రెడ్డి, రాజు, మధులత రెడ్డి, షరీఫ్, రజియా, కమలమ్మ తదితరులు పాల్గొన్నారు.

