ఎడవల్లి తిమ్మప్ప ఆధ్వర్యంలో కార్యక్రమం
తుగ్గలి, ఆగస్టు 3 (7టీవీ ఫోకస్ న్యూస్) తుగ్గలి మండల పరిధిలోని మామలకుంట గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో “ఇంటింటికీ తెలుగుదేశం” కార్యక్రమాన్ని ఎడవల్లి తిమ్మప్ప ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉమ్మడి కర్నూలు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు ప్రతి అర్హులైన కుటుంబానికి చేరేలా పార్టీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తున్నాయని తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు తిరుపాల్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సలహా మండలి సభ్యులు పి. వెంకటపతి, కొట్టాల వెంకట్రామ చౌదరి, కొమ్మ వెంకటేష్, సంఘాల కృష్ణ, వల్లే వెంకటేష్, బెస్త కృష్ణయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

