7టీవీ ఫోకస్, జవహర్నగర్, జూలై 9: జవహర్నగర్ డివిజన్ పరిధిలోని జ్యోతి, బజరంగ్ కాలనీల్లో స్థానిక సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని డివిజన్ అధ్యక్షురాలు దొంతగాని శాంతికోటేష్ గౌడ్ తెలిపారు. కాలనీల అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని ఆమె పేర్కొన్నారు. జవహర్నగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా డివిజన్ అధ్యక్షురాలు దొంతగాని శాంతికోటేష్ గౌడ్ జ్యోతి కాలనీ, బజరంగ్ కాలనీల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా జ్యోతి కాలనీ అధ్యక్షుడు జి. సూర్యనారాయణ (బబ్లు), బజరంగ్ కాలనీ అధ్యక్షుడు ఇంద్రాసేన రావులను కలిసి ఆయా కాలనీల్లో నెలకొన్న తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు తదితర స్థానిక సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాలనీవాసులను ఉద్దేశించి శాంతికోటేష్ గౌడ్ మాట్లాడుతూ, కాలనీల అభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమని తెలిపారు. ప్రజలకు సంబంధించిన సమస్యలను దశలవారీగా పరిష్కరించే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రతి అర్హుడైన ఓటరు హక్కు కోల్పోకుండా ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో ప్రతి ఒక్కరూ చురుకుగా పాల్గొని అవసరమైన సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు బల్లి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు ప్రేమల శ్రీను, కుతాడి సాయి, కృష్ణ గౌడ్, ఎస్సీ సెల్ చైర్మన్ కొలిపాక సాయికిరణ్, మాజీ ఎంపీటీసీ విజయ్ రాయ్, ఏడుకొండలు, సరితతో పాటు స్థానిక నాయకులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

