7 టీవీ ఫోకస్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన పలు డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన సాయిబాబా నగర్ డివిజన్ అధ్యక్షులు అకుల హరి కిరణ్, బహదూర్‌పల్లి డివిజన్ అధ్యక్షులు మైసిగరి శ్రీనివాస్, పేట్ బషీరాబాద్ డివిజన్ అధ్యక్షులు బండి శ్రీనివాస్ గౌడ్, కొంపల్లి డివిజన్ అధ్యక్షులు ఆదిరెడ్డి మోహన్ రెడ్డి, నిజాంపేట్ డివిజన్ అధ్యక్షులు కోటపాటి మురళి, బాచుపల్లి డివిజన్ అధ్యక్షులు కొలన్ జీవన్ రెడ్డి, ప్రగతి నగర్ డివిజన్ అధ్యక్షులు బొమ్ము వెంకటేశ్వర రెడ్డి (తాతిరెడ్డి), మహాదేవపురం డివిజన్ అధ్యక్షులు సిద్దనోళ్ల సంజీవ్ రెడ్డి, జగద్గిరిగుట్ట డివిజన్ అధ్యక్షురాలు హైమావతి, కుత్బుల్లాపూర్ డివిజన్ అధ్యక్షులు ప్రవీణ్ ముదిరాజ్, దూలపల్లి డివిజన్ అధ్యక్షులు బైరి శివకుమార్ గౌడ్, బండారి లేఔట్ డివిజన్ అధ్యక్షులు వాసు, సూరారం డివిజన్ అధ్యక్షులు శ్రీశైలం యాదవ్, గణేష్ నగర్ డివిజన్ అధ్యక్షులు ఇరుగు రాధ క్రిష్ణ, షాపూర్ నగర్ డివిజన్ అధ్యక్షులు పాలకృష్ణ, చింతల్ డివిజన్ అధ్యక్షులు జలీల్ ఖాన్, బౌరంపేట్ డివిజన్ అధ్యక్షులు అర్కల విజయ్ గౌడ్, సుభాష్ నగర్ డివిజన్ అధ్యక్షులు ద్వారంపూడి నాగిరెడ్డి, దుండిగల్ డివిజన్ అధ్యక్షులు జక్కుల మల్లేష్ యాదవ్ గార్లు.

అనంతరం హన్మంతన్న నూతనంగా ఎన్నికైన డివిజన్ అధ్యక్షులను శాలువాలతో ఘనంగా సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతమే ప్రతి డివిజన్ అధ్యక్షుడి ప్రధాన లక్ష్యంగా ఉండాలని అన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యలను తెలుసుకొని, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రజాహిత కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని సూచించారు.పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే ప్రతి కార్యకర్తకు సముచిత గుర్తింపు, ప్రాధాన్యం లభిస్తుందని పేర్కొంటూ, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి అందరూ సమిష్టిగా, సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల విశ్వాసాన్ని చూరగొని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త తన వంతు కృషి చేయాలని ఆకాంక్షించారు.

