7టీవీ 9-8-ఫోకస్ కుత్బుల్లాపూర్ : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారంలోని ఖైసర్ నగర్ లో బోనాల పండుగను ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రేణుక ఎల్లమ్మ, పోచమ్మ తల్లి విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి ప్రతిష్ఠించారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి బోనాల వేడుకలను ప్రారంభించారు.

బోనాల పండుగలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని నెత్తిన బోనాలు ఎత్తుకుని భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా తరలివెళ్లారు. అనంతరం అమ్మవారి విగ్రహాలకు పూలు, పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ వేడుకలకు రేణుక ఎల్లమ్మ పోచమ్మ దేవాలయ వ్యవస్థాపకులు మద్దెల సాయిబాబా సురారం పోలీస్ ఇంస్పెక్టర్ బాలరాజు, సెక్టార్ ఇంస్పెక్టర్ కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రెసిడెంట్ బాలకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ రాజు యాదవ్, జనరల్ సెక్రటరీ వెంకటేష్‌తో పాటు రాములు, అజయ్ గుప్తా, రవీందర్, శేఖర్, శేఖర్ లక్ష్మణ్, శ్రీనివాస్‌రావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మద్దెల సాయిబాబా మాట్లాడుతూ.. బోనాల వేడుకలను ఇంత ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. రేణుక ఎల్లమ్మ, పోచమ్మ తల్లి ఆశీస్సులు ఖైసర్ నగర్ ప్రాంత ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.

