కుత్బుల్లాపూర్లో కాంగ్రెస్ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి
7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూన్ 28: ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకుని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని కోరారు. జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యూఎంసీసీ కాలనీ అధ్యక్షులు దేగాల సతీష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన పోలియో టీకా కార్యక్రమంలో హన్మంత్ రెడ్డి పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి చిన్నారికి సమయానికి పోలియో చుక్కలు వేయించడం తల్లిదండ్రుల బాధ్యత అని, ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని సూచించారు.

తర్వాత కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఉషోదయ కాలనీ కమ్యూనిటీ హాల్లో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమాన్ని బీఎల్ఓలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటరు నమోదు, సవరణ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువత తప్పనిసరిగా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఇప్పటికే ఓటరు జాబితాలో ఉన్నవారు తమ వివరాల్లో మార్పులు ఉంటే సవరణ చేసుకోవాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అమూల్యమైనదని, ప్రతి అర్హుడూ తన ఓటు హక్కును వినియోగించుకునేలా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఎల్ఓలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

