7tv focus : ఏపీలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది. కూటమి- వైసీపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకం గా తీసుకుంటున్నాయి. సెమీ ఫైనల్స్ గా భావిస్తున్నాయి. కూటమి నేతలు ఏకపక్షంగా విజయం సాధించటం పైనే ప్రణాళికలు సిద్దం చేస్తున్నాయి. అటు మాజీ సీఎం జగన్ సైతం తన మార్క్ నిర్ణయాలతో సిద్దం అవుతున్నారు. కాగా.. పులివెందుల పైన టీడీపీ కొత్త వ్యూహం అమలు చేస్తోంది. ఇటు జగన్ తమ అభ్యర్ధిని ఫిక్స్ చేసారు. దీంతో.. ఇక్కడ పోరు ఆసక్తిగా మారుతోంది.స్థానిక ఎన్నికల్లో టీడీపీ నాయకత్వం ఎక్కడా వైసీపీకి అవకాశం ఇవ్వకూడదని భావిస్తోంది. కూటమి సీట్ల ఖరారు లోనూ ఆచి తూచి వ్యవహరిస్తోంది. మాజీ సీఎం జగన్ తాజాగా పార్టీ నేతలకు స్థానిక ఎన్నికలకు దిశా నిర్దేశం చేసారు. ఎక్కడైనా ఏకగ్రీవం అయితే ఆ నియోజకవర్గ ఇంఛార్జ్ కు సీటు ఉండదని తేల్చి చెప్పారు. దీంతో.. పులివెందుల నియోజకవర్గ పరధిలో ఏకగ్రీవాలతో పాటుగా పులివెందుల మున్సిపాల్టీని సొంతం చేసుకొనేందకు టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక ఎన్నికలు వరుసగా ఇలా, సీట్లు..పోటీ పై కొత్త ఫార్ములా – చంద్రబాబు నిర్దేశం..!! ఇక్కడ ఎన్నికల కోసం మంత్రుల కమిటీని ఏర్పాటు చేశారు. వైసీపీ అసంతృప్తులు.. బలమైన నాయకుల ను కూడా చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పులివెందుల కేంద్రంగా బీటెక్ రవి, ఎమ్మెల్సీ రాం భూపాల్ రెడ్డికి ప్రత్యేకంగా బాధ్యతలు కేటాయించారు. గత ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ గెలుపు కు రివేంజ్ గా ఈ సారి పులివెందుల లో టీడీపీ గెలవాలని పట్టుదలతో అడుగులు వేస్తోంది.

