7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 27: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి రాజీవ్ గాంధీ నగర్లో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు చీరలు అందజేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని బాచుపల్లి రాజీవ్ గాంధీ నగర్‌లోని నల్ల పోచమ్మ ఆలయ ప్రాంగణంలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ, మహిళల సంక్షేమం, సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హులైన లబ్ధిదారునికి చేరేలా చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఇందిరమ్మ చీరల పంపిణీతో మహిళల్లో ఆనందం, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని పేర్కొన్నారు. మహిళల అభివృద్ధే సమాజ అభివృద్ధికి పునాదిగా నిలుస్తుందని, ప్రజలకు అవసరమైన ప్రతి సందర్భంలో ప్రభుత్వం అండగా ఉంటూ సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ కొలన్ కృష్ణారెడ్డి, కొలన్ జీవన్ రెడ్డి, కొలన్ బాల్ రెడ్డి, డ్వాక్రా గ్రామ అధ్యక్షురాలు ఇందిరా కడియాల, ఉపాధ్యక్షురాలు శ్రీదేవి, యశోద, ఆర్.పీ. కరుణ, ఆర్.పీ. జ్యోతి, ఏరోళ్ల విష్ణు, సీతారాం రెడ్డి, ఎం. అశోక్, పి. సాయిరాజ్, విజయ్, షకీల్‌తో పాటు కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

