07-08-7tv త సంవత్సరం నుండి అధికారుల నిర్లక్ష్యం వల్ల బురద మైయం అయినా అర్జీకే రోడ్డులు
-సిపిఐ బాచుపల్లి మండల కార్యదర్శి పాలభిందెల శ్రీనివాస్.
నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని రాజీవ్ గృహ కల్పలో గత సంవత్సరం నుండి బురద మైయం అయినా అధికారులు ఇటు వైపు రాకపోవడంతో స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు అని సిపిఐ ఆధ్వర్యంలో రాజీవ్ గృహ కల్ప బ్లాక్ నెంబర్. 72 వద్ద నిరసన ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి పాలభిందెల శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంత మంది స్థానిక నాయకులు వచ్చిన మా రోడ్లు బాగు అవ్వటం లేదు అని స్థానిక ప్రజలు చెప్పడంతో

అర్జీకే బ్లాక్ నెంబర్ 72 వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించము అని వారు అన్నారు. ఇక్కడ గత అనేక నెలలుగా రోడ్డు బురదతో నిండి పోయింది అని గుర్తు చేశారు. ఇంత కాలం అవుతున్న మున్సిపల్ అధికారులు అర్జీకే రోడ్డును బాగుచేయకపోవడం బాధాకరం అని అన్నారు. కనుక రాజీవ్ గృహ కల్ప రోడ్డును వెంటనే బాగు చేయాలనీ వారు డిమాండ్ చేశారు. అలాగే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే బద్లావ్ జరూరి హై ఛలో ఢిల్లీ కార్యక్రమని జయప్రదం చేయాలనీ వారు కోరారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ ఏఐటీయూసీ కన్వీనర్ పొన్నకంటి దస్తగిరి, రేణుక, రమాదేవి, విజయ లక్ష్మి, స్వాతి, నవనీత, పూజ, పప్పీ తదితరులు పాల్గొన్నారు

