7tv focus : చత్తీస్‌ఘడ్‌లోని బస్తర్ జిల్లాలో ఉన్న భద్రతా బలగాలతో.. ఇవాళ ప్రధాని మోదీ దీపావళి సంబరాలను జరుపుకున్నారు. బస్తర్‌లో నక్సల్స్‌తో పోరాడిన భద్రతా దళాలను ఆయన సత్కరించారు. ఒకప్పుడు నక్సలిజంకు బస్తర్ జిల్లా కేంద్ర బిందువుగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ ప్రాంతాన్ని నక్సలిజం నుంచి విముక్తి చేశారు. అక్కడ ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మీ త్యాగాల వల్లే .. నక్సల్ ఉగ్రవాదాన్ని అంతం చేసినట్లు ఆయన చెప్పారు. ఈ ప్రాంతంలో నక్సలిజం ముగిసిన తర్వాత జరుగుతున్న తొలి దీపావళి వేడుక అని ఆయన అన్నారు.అడవుల్లో నక్సల్స్ అంతం అయ్యారని, కానీ దిమాగీ నక్సల్స్ మాత్రం ఇంకా దాక్కుని ఉన్నట్లు ఆయన చెప్పారు. వివిధ సంస్థల్లో దిమాగీ నక్సల్స్ చొరబడినట్లు ఆయన చెప్పారు. దేశ సరిహద్దుల్లో సైనికులు ఎంత ముఖ్యమో.. దేశం లోపల తీవ్రవాదాన్ని ఎదుర్కోవడం కూడా అంతే ముఖ్యమన్నారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు అంతర్గత భద్రత కీలకమైందని ప్రధాని తెలిపారు. దేశ అంతర్గత భద్రత బలంగా ఉంటే, బయటి శత్రువులు దరిచేరరని, ఒకవేళ అంతర్గత భద్రత బలహీనపడితే, అప్పుడు బయటి శత్రువులు తలలు ఎత్తుకుంటారని ఆయన అన్నారు.

