7టీవీ ఫోకస్, కూకట్ పల్లి, జూలై 6: వర్ధంతి సందర్భంగా మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ నివాళి – మహనీయుల సేవలను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపు భారత మాజీ ఉప ప్రధానమంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఉమ్మడి ఆల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్ చౌరస్తాలో ఉన్న డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ, డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ స్వాతంత్ర్య సమరయోధుడిగా, సంఘసంస్కర్తగా, సమర్థ పరిపాలకుడిగా దేశానికి విశిష్ట సేవలందించారని కొనియాడారు. నిబద్ధత, నిజాయితీ, సామాజిక న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి విలువలను ప్రజల్లో చాటిచెప్పి, అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన మహానేత అని పేర్కొన్నారు. ఆత్మవిశ్వాసాన్ని ఆయుధంగా చేసుకుని దళితులు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిన నాయకుడిగా డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. దేశ రాజకీయాలు, పరిపాలన, సామాజిక న్యాయం రంగాల్లో ఆయన చేసిన సేవలను నేటి తరం స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సమ్మారెడ్డి, జి. రవి, ముజీబ్, మల్లేష్, అగ్రవాసు, రవీందర్, నాగరాజు, గోపి, తిరుపతి, నాగయ్య, వజీద్, బాలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

