సెంటినరీ వెస్లీ చర్చిలో బాలికల ఆదివారం ప్రత్యేక ఆరాధన
కరీంనగర్: CSI సెంటినరీ వెస్లీ చర్చి, క్రిస్టియన్ కాలనీలో బాలికల ఆదివారం సందర్భంగా ప్రత్యేక ఆరాధన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘంలోని బాలికలు బైబిల్లోని వివిధ మహిళా పాత్రలను ప్రదర్శిస్తూ, సమాజంలో బాలికల గౌరవం, హక్కులు, ప్రాధాన్యత మరియు సాధికారత గురించి చక్కని సందేశాన్ని అందించారు.
ఈ ప్రత్యేక ఆరాధనలో సంఘ కాపరులు రెవ. డి. పురుషోత్తం (పాస్టరేట్ ఛైర్మన్), రెవ. యం. పింటు, రెవ. యన్. సునీత పురుషోత్తం,సంఘ కార్యదర్శి చంద్రపల్క సంజయ్ కుమార్, కోశాధికారి సి. నారాయణ మరియు సంఘ పెద్దలు, విశ్వాసులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సందేశమిచ్చిన సంఘ కాపరి రెవ. డి. పురుషోత్తం మాట్లాడుతూ, బాలికల స్వరాన్ని ప్రతి ఒక్కరూ ఆలకించాలని, కుటుంబంలో, సంఘంలో, సమాజంలో వారికి తగిన గౌరవం, సమాన అవకాశాలు కల్పించాలని పిలుపునిచ్చారు. బాలికలు భయం, వివక్ష, ఆంక్షలు లేని వాతావరణంలో తమ ప్రతిభను చాటుకుంటూ, స్వేచ్ఛగా తమ భవిష్యత్తును నిర్మించుకునేందుకు తల్లిదండ్రులు, సంఘం మరియు సమాజం సహకరించాలని ఆయన సూచించారు.
బాలికల భద్రత, గౌరవం, విద్య మరియు సమానత్వం కేవలం కుటుంబ బాధ్యత మాత్రమే కాకుండా, సమాజంలోని ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఆయన ఉద్ఘాటించారు.

