చిల్లర విషయంలో ప్రయాణికురాలు బస్ నుండి తోసేయగా బస్ ప్రమాదంలో మహిళా కండక్టర్ మృతి పట్ల ఆర్టీసీ కార్మికులు నిరసన తెలిపారు. పది రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో మణుగూరు డిపో కండక్టర్ ప్రవళిక బస్ కింద పడి గాయాలపాలైంది. హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచింది. ఆమె మృతికి సంతాపంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్టీసీ ఉద్యోగులు బంద్కు పిలుపునిచ్చారు. అన్ని డిపోల్లో కార్మికులు వర్షంలో నిరసన తెలిపారు. డిపోల నుండి బస్సులను కదలనివ్వలేదు. ఆమె మృతికి కారణం అయిన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆయా డిపో మేనేజర్లు ప్రవళిక చిత్ర పటానికి నివాళులు అర్పించారు.

