7tv focus : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హైదర్‌నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి తన అనుచరులతో కలిసి భారీగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెట్ కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారుఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మీరంతా రేవంత్ రెడ్డి మాటలు వింటా ఉన్నరు.. ఆయనే కదా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇస్తా అన్నడు.. మరి ఇప్పుడు మియాపూర్‌లో జాగా వచ్చింది కదా.. రేవంత్ రెడ్డి నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ భూముల్లో తెలంగాణ ఉద్యమంలో పని చేసినవాళ్లందరికీ జాగా ఇస్తావా..? గట్టిగా చప్పట్లతో ఆయనను అడగండి అని అన్నారు. హైదరాబాద్‌లోని పేదలందరికీ 100 ఎకరాల్లో మంచిగా టవర్స్ కట్టు.. అందరికీ పేదవాళ్లకు ఇండ్లు ఇయ్యి.. మేమన్నా వద్దంటున్నమా..? అన్నారు.నువ్వే అంటున్నవ్ కదా కేసీఆర్ అక్కడెక్కడో 75 కిలోమీటర్ల దూరంలో ఎర్రవెల్లి అనే ఊరిలో ఉన్నరు.. హైవే నుంచి లోపలికి 12 కిలోమీటర్ల లోపల ఉంటది.. అట్లాంటి ఎర్రవెల్లిలో కేసీఆర్ ఉంటున్నరన్న కోపంతో.. రాష్ట్ర రాజకీయాలకు అది కేంద్రబిందువైందన్న కోపం మీద అమర వీరులను తీసుకుపోయి ఎర్రవెల్లిలో కాలనీ కట్టిస్తడట రేవంత్ రెడ్డి.. మరి నేనడుగుతున్నా రేవంత్ రెడ్డిని ఎక్కడో ఎర్రవల్లిలో 80 కిలోమీటర్ల అవతల ఎందుకయ్యా..మియాపూర్‌లో బ్రహ్మాండంగా అమరవీరులకు ఇండ్లు కట్టియి.. మేమొద్దంటున్నమా..? అని కేటీఆర్ అన్నారు.
భూములు వస్తే అమ్మేస్తా అంటున్నడు..
మియాపూర్‌లో 550 ఎకరాల భూములు వస్తే అమ్మేస్తానని రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఆ భూముల్లో 200 ఎకరాలు పేదలకు ఇండ్లు, 100 ఎకరాల్లో అమరవీరులకు, ఇంకో 100 ఎకరాలు ఉద్యమకారులకు, మిగతాది పిల్లలకు స్కూల్స్, కాలేజీలు కట్టించు.. మేము గొప్పగా స్వాగతిస్తామన్నారు.

