మిడ్జిల్ ,జూలై 8 , 7టీవీ ఫోకస్ : సంక్షేమం, ఉచిత విద్యుత్, ఆరోగ్య సేవల విస్తరణ, విద్యా ప్రోత్సాహం, సామాజిక న్యాయం వంటి రంగాల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలు చిరస్థాయిగా నిలిచిపోయాయని మండల కాంగ్రెస్స్ పార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ గౌస్ పేర్కొన్నారు. ప్రజలనే తన కుటుంబంగా భావించి, వారి సంక్షేమమే పరమావధిగా జీవితాంతం కృషి చేసిన మహోన్నత ప్రజానాయకుడిగా ఆయనను కొనియాడారు.ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు,

ప్రజాసేవ పట్ల ఆయన అంకితభావం, మానవతా దృక్పథం నేటికీ కోట్లాది మందికి స్ఫూర్తినిస్తున్నాయని పేర్కొన్నారు.సందర్భంగా మిడ్జిల్ న్యూ బస్సు స్టాండ్ అంబేద్కర్ పార్క్ వద్ద మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మండల అధ్యక్షులు తంగెళ్ల ఆల్వాల్ రెడ్డి , మిడ్జిల్ టౌన్ సర్పంచ్ ఎడ్ల శంకర్ సీనియర్ నాయకులు వెంకటయ్య , బాల్ రెడ్డి , సంపత్ ,విజయ్ కుమార్ , నరేందర్ రెడ్డి , పర్వతాలు , ఆడమ్ ,జహీర్, కృష్ణ , ఒస్మాన్ ,భాస్కర్ రెడ్డి ,రామ్ గౌడ్ ,బాలయ్య , పాల్గొని డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్ర పటానికి పూలమాలేసి ఘన నివాళులర్పించారు. సర్పంచ్ ఎడ్ల శంకర్ మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నారని ఆనాడు ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఆరోగ్యశ్రీ రైతులకు అండగా ప్రతి ఎకరానికి నీళ్లు ఇచ్చిన ఘనత రాజశేఖర్ రెడ్డిధి అని తెలియజేశారు అనంతరం జోహార్ వైయస్సార్ అని నినాదాలు చేశారు.

