గురువుల కృషి ఫలించింది అమరావతి ట్రోఫీలో లక్కవరం స్కూల్ మెరుపులు
7 టివి ఫోకస్ ఆగస్టు 10 జంగారెడ్డిగూడెం చిన్న పల్లె నుండి రాష్ట్రస్థాయికి లక్కవరం విద్యార్థుల సత్తా చాటారు జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లక్కవరం విద్యార్థులు క్రీడా రంగంలో రాణించి పాఠశాలకే కాకుండా చింతలపూడి నియోజకవర్గానికి గర్వకారణంగా నిలిచారు ఇటీవల జిల్లా స్థాయిలో ఏలూరు లో జరిగిన అమరావతి ఛాంపియన్ ట్రోఫీ క్రీడా పోటీల్లో చింతలపూడి నియోజకవర్గం నుండి పాల్గొన్న లక్కవరం జెడ్పీహెచ్ స్కూల్ విద్యార్థులు కో కో క్రీడలో అద్భుత ప్రతిభ కనబరిచారు ఈ పోటీల్లో పాఠశాలకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు పాల్గొని ద్వితీయ స్థానాన్ని సాధించారు వీరి విజయంతో పాటు జె. అన్విత వై. యామిని వి. గణపతి అనే ముగ్గురు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు విద్యార్థులను అత్యంత క్రమశిక్షణతో పట్టుదలతో తర్ఫీదునిచ్చిన పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు కె. లక్ష్మణ్ మరియు డి. రాముల కృషి ఈ విజయానికి ప్రధాన కారణమని ప్రధానోపాధ్యాయులు జి. దుర్గారావు తెలిపారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు జి. దుర్గారావు పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ దల్లి దుర్గారావు ఉపాధ్యాయ బృందం విజేతలైన విద్యార్థులను మరియు వారికి శిక్షణనిచ్చిన ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించి రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా ఇదే ఉత్సాహంతో పాల్గొని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు గ్రామీణ ప్రాంత పాఠశాల నుండి ఇంతటి ప్రతిభను చాటిన విద్యార్థులను స్థానికులు అభినందిస్తున్నారు

