చిలుకనగర్‌లో రూ.34.50 లక్షలతో నవోదయ వడ్డెర సంఘం కమ్యూనిటీ హాల్‌కు శంకుస్థాపన
ముఖ్య అతిథిగా రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్పర్సన్ గుంజ రేణుక నారాయణ..
వడ్డెర జాతి హక్కుల కోసం నిరంతర పోరాటం చేస్తానని హామీ
7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 28: వడ్డెర సమాజ సామాజిక, సాంస్కృతిక అభివృద్ధికి కమ్యూనిటీ హాళ్లు ఆత్మగౌరవానికి ప్రతీకలుగా నిలుస్తాయని రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్పర్సన్ గుంజ రేణుక నారాయణ అన్నారు. చిలుకనగర్‌లోని నవోదయ వడ్డెర సంఘం ఆధ్వర్యంలో నిర్మించనున్న నూతన కమ్యూనిటీ హాల్‌కు ఆదివారం ఆమె భూమిపూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ, చిలుకనగర్ నవోదయ వడ్డెర సంఘం చిరకాల స్వప్నంగా ఉన్న కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.34.50 లక్షల నిధులు మంజూరు చేయడం సంతోషకరమన్నారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, వారి సామాజిక గౌరవాన్ని పెంపొందించే శాశ్వత వసతుల కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని ఆమె తెలిపారు. వడ్డెర జాతికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి, ముఖ్యంగా మైనింగ్ రంగంలో అవకాశాల కల్పన, రిజర్వేషన్ల సాధన కోసం ప్రభుత్వ స్థాయిలో తన వంతు కృషి చేస్తానని, సమాజ అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడుతానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జాతీయ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వల్లపు శివకుమార్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బోదాసు రవి మాట్లాడుతూ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్పర్సన్ గుంజ రేణుక నారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు వల్లపు శివకుమార్, జాతీయ వడ్డెర సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు బోదాసు రవి, గుంజ నారాయణ. స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

