డా. దాసరి శ్యామ్ చంద్ర శేషు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
జంగారెడ్డిగూడెం 7 టివి ఫోకస్ జూలై 4
ఈరోజు స్వాతంత్ర్య సమరయోధులు తెలుగువారి గుండె చప్పుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి మరియు భారత దేశ జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య వర్ధంతి సందర్భంగా జంగారెడ్డిగూడెంలో శ్రీ విజ్ఞాన్ జూనియర్ కళాశాలలో రాష్ట్ర శెట్టిబలిజ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబొయిన రామలింగేశ్వర రావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డా. దాసరి శ్యామ్ చంద్ర శేషు సిటికేబుల్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ పాల్గొన్నారు ఈసందర్భంగా శేషు మాట్లాడుతూ బ్రిటిష్ పాలనలో బ్రిటన్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన విప్లవ సింహం అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారి గుండెల్లో సింహస్వప్నంగా మారారు అని అన్నారు దేశం కోసం పోరాటంలో కేవలం 27 సంవత్సరాలు వయసులోనే బ్రిటిష్ వారి తూటాలకు తన ప్రాణాలను విడిచారని అన్నారు
అలాగే దేశానికి ఒక జెండా ఉండాలి అని అనేక మార్లు జాతీయ కాంగ్రెస్ మహాసభల్లో తన గళాన్ని వినిపించి గ్రంధాన్ని రచించి గాంధీ సూచనలతో దేశానికి జాతీయ జెండాను అందించిన మహా వ్యక్తి పింగళి వెంకయ్య అని ఆయన వర్ధంతి సందర్భంగా ఘననివాలి అర్పిస్తున్నాం అన్నారు పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ దేశం ఫస్ట్ తరువాతే మనం అని ఈ దేశం నాకేమి చేసింది అనేది కాకుండా దేశానికి నేను ఏమి చేశా అని ఆలోచన ప్రతి ఒక్కరు చెయ్యాలని అన్నారు దేశం కోసం మహనీయులు చేసిన త్యాగాన్ని ప్రతి ఒక్కరు గుర్తు ఉంచుకుని మంచి లక్షణాలతో ఉన్నతమైన లక్ష్యాలతో ముందుకు సాగాలని కోరారు ఈకార్యక్రమంలో పట్టణ కార్మిక విభాగం అధ్యక్షుడు కొంచడా ప్రసాద్ కళాశాల యాజమాన్యం తోట రాజ కుమార్ ఎస్వీఆర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు

