7tv focus : అనంతగిరి హిల్స్ కు హైదరాబాద్ వాసులు నిత్యం క్యూ కడుతుంటారు. వారమంతా పని చేసి ఆ ఒత్తిడిని దూరం చేసుకోవడానికి ఎక్కువగా అనంతగిరి హిల్స్ నే సందర్శిస్తుంటారు. అనంతగిరి హిల్స్ లో ప్రకృతి అందాలను చూడటం, ట్రెక్కింగ్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. హైదరాబాద్ కు కేవలం 70 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న అనంతగిరికి వెళ్తే సహజసిద్ధ ప్రకృతిని ఆస్వాదించవచ్చు. అందమైన లోకేషన్స్ తో పాటు పాటు ట్రెక్కింగ్, సైక్లింగ్, రొమాంటిక్ లేదా అడ్వెంచర్ సీన్స్ కు అనంతగిరి కొండలు ప్రాంతం అనుకూలంగా ఉంటుంది. ఇక భువనగిరి కోట గురించి తెలుసా..? ఈ కోటకు ఎంతో చరిత్ర ఉంది. అప్పటి కాలంలో శత్రువుల నుంచి రక్షణ పొందేందుకు బలీయమైన రాతితో సున్నితమైన బురుజుల శ్రేణులతో భువనగిరి కోటను నిర్మించారు. కోటపై చిన్న చిన్న గూళ్లు, శిల్పాలు, పుష్పగుచ్చాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ చారిత్రక కోట హైదరాబాద్ కు దగ్గరలోని భువనగిరిలో ఉంది. అలాగే వీకెండ్ ను ప్రకృతి మధ్య గడపాలని అనుకునేవారికి మల్లెల తీర్థం మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న ఈ జలపాతం రెయినీ సీజన్ లో మరింత ఆకర్షణగా నిలుస్తోంది. హైదరాబాద్ కు సుమారు 165 కిలోమీటర్ల దూరంలో ఈ మల్లెల తీర్థం జలపాతం ఉంది.

