7tv focus : నవంబర్ ఒకటో తేదీన ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో భారీ ఎత్తును కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహించనున్నది. ఆ ర్యాలీలో సుమారు 10 లక్షల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. అయితే ఆ ర్యాలీని వాయిదా వేయాలని ఢిల్లీ వ్యాపారులు ఇవాళ కాంగ్రెస్ నేత సోనియా గాంధీని వేడుకున్నారు. దీపావళి సీజన్ షాపింగ్ జరుగుతోంది కాబట్టి , ర్యాలీ వల్ల సుమారు 12వేల కోట్ల వ్యాపారంపై ప్రభావం పడే అవకాశం ఉందని, అందుకే ఆ ప్రతిపాదిత ర్యాలీని వాయిదా వేసుకోవాలని సోనియాను ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ కోరింది.
ఢిల్లీలో ఆందోళనలు చేయడం వల్ల సుమారు 20 కీలక మార్కెట్లకు నష్టం జరిగే ఛాన్సు ఉన్నట్లు వాణిజ్య సంఘాలు తెలిపాయి. నవంబర్ 11 తర్వాత ర్యాలీ నిర్వహించుకోవాలని, లేదంటే బురారీ గ్రౌండ్‌కు మార్చుకోవాలని వ్యాపారులు కోరారు. రామ్‌లీలా మైదానంలో ర్యాలీ వల్ల పార్కింగ్ సమస్యలు వస్తాయని, దీంతో సుమారు 20 లక్షల మంది వ్యాపారులపై వత్తిడి ఉంటుందని సీటీఐ తన అభ్యర్థనలో పేర్కొన్నది.

