7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూన్ 19:
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సాయిబాబా నగర్‌కు చెందిన తాహీర్ జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానికులు బాచుపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా హన్మంత్ రెడ్డి తాహీర్‌ను శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో, ఆనందంగా, మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.అనంతరం సూరారం గ్రామానికి చెందిన పలువురు స్థానికులు హన్మంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

