7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూలై 6: బీఆర్టీయూ నాయకుడు రవి జోక్యంతో పరిష్కారం – కార్మికుడికి న్యాయం జరిగిందని హర్షం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ మున్సిపల్ పరిధి గండి మైసమ్మ ప్రాంతానికి చెందిన పెయింటింగ్ కార్మికుడు సతీష్‌కుమార్‌కు రావాల్సిన రూ.20 వేల బకాయి వేతనం బీఆర్టీయూ రాష్ట్ర కార్మిక నాయకుడు, శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి జోక్యంతో అందజేశారు. సతీష్‌కుమార్ ఓ పెయింటింగ్ కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తుండగా, మార్చి నెలకు సంబంధించిన రూ.20 వేల వేతనం చెల్లించకుండా కాంట్రాక్టర్ పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చినట్లు తెలిసింది. పలుమార్లు అడిగినా ఫలితం లేకపోవడంతో బాధిత కార్మికుడు తోటి కార్మికుల సూచన మేరకు బీఆర్టీయూ రాష్ట్ర కార్మిక నాయకుడు రవిని కలిసి తన సమస్యను వివరించారు. దీనిపై వెంటనే స్పందించిన రవి సంబంధిత కాంట్రాక్టర్‌తో మాట్లాడి, సతీష్‌కుమార్‌కు రావాల్సిన పూర్తి వేతనం రూ.20 వేలును ఇప్పించారు. ఈ సందర్భంగా సతీష్‌కుమార్ మాట్లాడుతూ, తనకు న్యాయం జరిగేలా కృషి చేసిన రవికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంతోష్ గౌడ్, సుదర్శన్, జగన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

