గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి
బుద్దుల జంగయ్య
7టివి ఫోకస్ షాద్ నగర్ జులై08:తెలంగాణ గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తుందని ఇది సరైనది కాదని తెలంగాణ గ్రామ పంచాయతి వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు టంగుటూరి నరసింహారెడ్డి విమర్శించారు ఈ సందర్భంగా తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ కొందుర్గు మండల ఎంపీడీవో ఆఫీస్ ముందు జరిగిన ధర్నాకు ఆయన ముఖ్యదిగా విచ్చేసి మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కార్మికులకు కేటగిరీల వారిగావేతనాలు పెంచడం జరిగింది కానీ గ్రామపంచాయతీ కార్మికుల గురించి వాళ్ల వేతనాల గురించి మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందని ఆయన ఎదవ చేశారు నేడు తెలంగాణలో గ్రామపంచాయతీ కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని గత బిఆర్ఎస్ ప్రభుత్వం పై పోరాడితే 9500 వరకు పెంచడం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామపంచాయతీ కార్మికులకు ఒక్క రూపాయి కూడా పెంచకపోవడం కారణమేమిటో సమాధానం చెప్పాలని ఆయన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడిగారు గ్రామపంచాయతీ కార్మికులుగా పనిచేస్తున్నది ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలు మాత్రమే నేడు గ్రామాలు శుభ్రంగా ఉన్నాయంటే అది గ్రామపంచాయతీ కార్మికుల శ్రమ వారి శ్రమకు తగ్గ కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని అలాగే ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని సీఎప్ ఈఎస్ఐ కల్పించాలనిడిమాండ్ చేశారు ఈ ధర్నా కార్యక్రమా నికి మరో ముఖ్య అతిథి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం బికే ఎం యు జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధుల జంగయ్య విచ్చేసి మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుందని మండిపడ్డారు నేడు గ్రామపంచాయతీ కార్యదర్శులు సర్పంచులు చోటామోటా లీడర్స్ అందరూ పంచాయతీ కార్మికులపై జలుమ చలాయిస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదు అని ఆయన అధికారుల దృష్టికి తీసుకువచ్చారు పంచాయతీ కార్మికులకు సబ్బులు లేవు నూనెలు లేవు డ్రస్సులు చేతి బ్లౌజులు బూట్లు లాంటి సౌకర్యాలు ఏం లేకుండా వాళ్లు పనులు చేస్తున్నారు వారు అనారోగ్యానికి గురి అయితే ఎవరు బాధ్యులు అని ఆయన అధికారులను ప్రశ్నించారు వెంటనే పై సౌకర్యాలు అన్నీ కూడా వారికి కల్పించాలని లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయనడిమాండ్ చేశారు పలు డిమాండ్లతో కూడిన విన్నతి పత్రాన్ని సూపరిండెంట్ ఇన్చార్జి ఎంపీఓ గారికి ఇవ్వడం జరిగింది
ఈ కార్యక్రమంలో బి కే ఎం యు జిల్లా ప్రధాన కార్యదర్శిబుద్ధుల జంగయ్యజి పి వర్కర్స్ యూనియన్ మండలగౌరవ అధ్యక్షులు
జి యాదయ్య మండల అధ్యక్షుడు బి యాదయ్య ప్రధాన కార్యదర్శి పామిడి జంగయ్య కార్యదర్శి కార్యనిర్వాహక అధ్యక్షులు Nరాములు ప్రచార కార్యదర్శి సి జంగయ్య ఉపాధ్యక్షులు రాములు సహాయ కార్యదర్శి ఎం శ్రీను కార్యవర్గ సభ్యులు ఎం రమేష్ సి యాదయ్య రఫీ సత్తయ్య పద్మమ్మ
బి రంగయ్య తదితరులు పాల్గొన్నారు.

