జగద్గిరిగుట్ట డివిజన్ సంజయ్పురి కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని సంజయ్పురి కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఆదివారం భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద్ మాట్లాడుతూ, భక్తి, విశ్వాసం ఉన్న చోట అమ్మవారి కరుణ ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు.

పోచమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ నిర్మాణానికి సహకరించిన కమిటీ సభ్యులను, కాలనీవాసులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జగన్, డివిజన్ అధ్యక్షుడు రుద్ర అశోక్, శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, ఆలయ కమిటీ చైర్మన్ రేగూరి ప్రవీణ్ గుప్తా, అధ్యక్షుడు గుంటుక శ్రీకాంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నైనొల్ల లక్ష్మణ్, కోశాధికారులు పున్న వెంకటేష్ (కోల్గేట్), వడ్డల్పు రాము, నిర్వహణ కార్యదర్శి మాతూరి వాసు, పుల్లరి రాజు, బరిగె గణేష్, సలహా బృందం అధ్యక్షుడు అరుణ్ రెడ్డి, ఎం.డి. షౌకత్ పాషా, మాజీ అధ్యక్షులు అప్పల శ్రీనివాసరావు, ముప్పాల వెంకటేశ్వరులు, వేముల టైలర్ రాములు, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు నెమూరి సాయికిరణ్, మాదాసు రాజు, కోపూరి కృపాకర్, అరవింద్, సీనియర్ నాయకులు మల్లేష్ గౌడ్, పాపిరెడ్డి, గిరి, బస్వేశ్వర్, జయకృష్ణ, సన్నీ, స్టార్లిన్ తదితరులు పాల్గొన్నారు.

