కుత్బుల్లాపూర్, జూలై 10 (7 టీవీ ఫోకస్): ప్రత్యేక ఓటరు జాబితా సవరణను పరిశీలించిన కొలన్ హన్మంత్ రెడ్డి ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి అధికారులను కోరారు. ప్రజలు కూడా ఎన్యుమరేషన్ ఫారాలను సక్రమంగా నింపి సమర్పించి ఓటరు జాబితా సవరణ కార్యక్రమానికి సహకరించాలని పిలుపునిచ్చారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 273వ డివిజన్ నిజాంపేట్ బాలాజీ కాలనీలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. మహిళా అధ్యక్షురాలు ఇందిరా, డివిజన్ అధ్యక్షుడు కోటపాటి మురళి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో బూత్ లెవెల్ అధికారులు (బీఎల్ఓలు)తో కలిసి ఆయన ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంటింటికీ వెళ్లి ఓటరు నమోదు ప్రక్రియను పారదర్శకంగా, నిష్పాక్షికంగా, సమర్థవంతంగా నిర్వహించాలని బీఎల్ఓలకు సూచించారు. అర్హత ఉన్న ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవడంతో పాటు, ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా వివరాలను నమోదు చేయాలని కోరారు. ప్రజలు కూడా బీఎల్ఓలు అందజేసే ఎన్యుమరేషన్ ఫారాలను పూర్తిగా నింపి సమర్పించాలని, ముఖ్యంగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువత కొత్త ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడూ ఓటరుగా నమోదు కావడం సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ సర్కిల్ అధ్యక్షుడు కొలన్ రాజశేఖర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు అంజలి యాదవ్, బహదురుపల్లి అధ్యక్షుడు మైసిగారి శ్రీనివాస్, మహాదేవపురం అధ్యక్షుడు సంజీవ రెడ్డి, సీనియర్ నాయకుడు ఆలేటి శ్రీనివాస్ రావు, బీఎల్ఓలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.

