తెలంగాణ 7t focus : తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. ములుగు జిల్లాలో ఉన్న యువతను తప్పుదోవ పట్టిస్తూ అక్కడ యువతను ఆకర్షించే విధంగా క్రికెట్ మ్యాచ్‌ల పేరు మీద స్వయంగా మంత్రి సీతక్క కొడుకు సూర్య ములుగు ప్రీమియర్ లీగ్ పేరు మీద క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తుండు. ఇది యూట్యూబ్ లైవ్‌లో కూడా ఓ లింక్ వస్తుంది.. మీరూ కూడా చూడండి. ఈ లైవ్‌లోనే సూర్య ఫొటో కూడా ఉంటుంది.హస్తం గుర్తు.. సూర్య ఫొటోతో ఒక క్రికెట్ మ్యాచ్ లైవ్ వస్తుంది.. ఇదేదో మేం ములుగు ఇతర ప్రాంతాల్లో నుంచి యువతను ప్రోత్సహించడానికి వీల్లేమైనా టోర్నమెంట్ పెట్టారేమో అనుకున్నం. ఇదెక్క్డడ జరుగుతుందంటే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడికైతే పోయి పైలాన్, కలెక్టరేట్ ఓపెనింగ్ చేస్తున్నారో.. అక్కడి 2-3 కిలో మీటర్ల దూరంలోనే ఉన్న పోలీస్ స్టేడియంలోనే జరుగుతుంది. ఆ పోలీస్ స్టేడియాన్నే లీజుకు తీసుకొని అదే స్టేడియంలో ఒక టోర్నమెంట్ పెట్టుకున్నారు. దాంట్లో 8 టీమ్‌లుంటాయి. పవిత్రమైన దేవుళ్ల మీద పేరు పెట్టుకొని వాళ్లు చేస్తున్న పనేందంటే బెట్టింగ్. ఆ టోర్నమెంట్‌ను ఓపెనింగ్ రోజు లాంచ్ చేసిందెవరంటే అక్కడున్న పోలీస్ అధికారి ములుగు ఎస్పీ.. పోలీస్ స్టేడియంలో పోలీస్ అధికారితోనే ఓపెన్ చేయించి.. ఓపెన్‌గా బెట్టింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు.

