7tv focus : తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ కాలంలో చాలా సందర్భాల్లో ఇందిరాపార్క్ దగ్గర జరిగిన ధర్నాలు, సమ్మెలు చూసిన.. కరెంట్ కోతలకు వ్యతిరేకంగా రైతులు కానీయండి..పవర్ హాలీడేస్ డిక్లేర్ చేయాల్సిన అగత్యం వచ్చి పరిశ్రమల కానీ ధర్నాలు చేసిన సంఘటనలు చూసినమని అన్నారు. దానికి కొనసాగింపుగా అన్నట్టుగా పరాకాష్టగా ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి కర్ర పట్టుకొని తెలంగాణ ఏర్పడితే కరెంట్ కష్టాలుంటాయి.తెలంగాణ అంధకారంలో మునిగిపోతదని పత్రికా సమావేశాలు పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన విషయాన్ని ఒకసారి తెలంగాణ సమాజానికి గుర్తు చేస్తూనే తదనంతరం అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ఒక రుషివలే తపస్సు చేసినట్టుగా అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసి కనురెప్పపాటు కూడా కరెంట్ పోకుండా దేశమంఆ నివ్వెరపోయేలా కరెంట్ అందించిన ఘనత కేసీఆర్‌ది.. బీఆర్ఎస్ పార్టీదని దాసోజు శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. కేవలం 7 వేల మెగావాట్ల ప్రతిపాదిత సామర్థ్యం ఉన్న కరెంట్ ఉత్పత్తిని 20 వేల మెగావాట్ల వరకు దాన్ని పరెగెత్తించి ప్రపంచమే ఔరా అని అబ్బురపోయే రీతిలో కేసీఆర్ రెవెల్యూషనైజ్ ది ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ ది స్ట్రేట్ ఆఫ్ తెలంగాణ దేశంలోనే అంత త్వరిత గతిలో కరెంట్ ఉత్పత్తికి తోడ్పడిన ప్రభుత్వం కానీ, నాయకుడు కానీ లేరు. అది కేసీఆర్‌కు మాత్రమే వర్తిస్తుందన్నారు.

