7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూన్ 29: ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందించడంతో పాటు సనాతన సంస్కృతి పరిరక్షణకు దోహదపడతాయని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎల్పీ విప్ కె.పీ. వివేకానంద అన్నారు. మిథిలా నగర్లోని శ్రీ విజయదుర్గాదేవి ఆలయం 9వ వార్షికోత్సవ మహోత్సవంలో పాల్గొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గాజులరామారం సర్కిల్ పరిధిలోని మహదేవపురం వార్డు-277లో, ప్రగతి నగర్ సమీపంలోని మిథిలా నగర్లో ఉన్న శ్రీ విజయదుర్గాదేవి ఆలయంలో సోమవారం నిర్వహించిన 9వ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమాల్లో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎల్పీ విప్ కె.పీ. వివేకానంద భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన. ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలగాలని, సుఖసంతోషాలతో జీవించాలని, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని ప్రార్థించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి ఆశీర్వాద ప్రసాదాన్ని అందజేశారు. భక్తులతో కలిసి మహోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న వివేకానంద మాట్లాడుతూ, ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను బలోపేతం చేయడంతో పాటు భారతీయ సనాతన సంస్కృతి పరిరక్షణకు దోహదపడతాయని అన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఆలయ నిర్వాహక కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బొప్పన రజినీ, ఉపాధ్యక్షురాలు ఉమామహేశ్వరి, కార్యదర్శి భవాని, కమిటీ సభ్యులు సుహాసిని, అమరేశ్వరి, వాణి, నందన, పద్మ, దేవి, కాలనీ ప్రముఖులు రవీంద్రనాథ్ ఠాగూర్, శ్రీనివాస్, నాగ ప్రవీణ్, నాగేశ్వరరావు, కిరణ్ చక్రవర్తి, బీఆర్ఎస్ నాయకులు శ్రీకర్ గుప్తా, బొబ్బా శ్రీనివాస్, వై.ఎస్.ఆర్., భక్తులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

