7 టీవీ ఫోకస్ పత్రికా ప్రకటన ది.16.07.2026.
నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారిని మర్యాదపూర్వకంగా కలిసిన 2003 నోటిఫికేషన్ లో సెలెక్ట్ అయిన పోలీస్ అధికారులు మరియు సిబ్బంది.ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వారు 2003 నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన ఉద్యోగులను సి.పి.ఎస్ (కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) నుండి పాత పెన్షన్ విధానం (OPS) పరిధిలోకి మారుస్తూ జీవోను విడుదల చేసిన నేపధ్యంలో ఎన్.టి.ఆర్. పోలీస్ కమీషనరేట్ నందు వివిధ హోదాలలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు మరియు సిబ్బంది అందరూ కలిసి అడ్మిన్ డి.సి.పి. శ్రీమతి కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్ గారి నేతృత్వంలో ఈ రోజు పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం నందు పోలిస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు.ఈ సందర్భంగా నగర పోలీస్ కమీషనర్ గారు మాట్లాడుతూ…..2003 నోటిఫికేషన్ ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణ ఫలించి, వారికి పాత పెన్షన్ విధానం (OPS) వర్తించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇది పోలీస్ సిబ్బంది మరియు వారి కుటుంబాలలో మానసిక ప్రశాంతతను, భవిష్యత్తుపై ధీమాను నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే ఉత్సాహంతో సిబ్బంది అందరూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడ్మిన్ డి.సి.పి. శ్రీమతి కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్ గారు, టాస్క్ ఫోర్స్ ఎ.డి.సి.పి. శ్రీమతి లతాకుమారి గారు, ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ ఎం. సోమయ్య గారు, వివిధ విభాగాలకు చెందిన పోలీస్ అధికారులు మరియు 2003 బ్యాచ్‌కు చెందిన లబ్ధిదారులైన పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొని కృతజ్ఞతలు తెలియజేశారు.

