7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూన్ 27: ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియలో ప్రతి ఓటరు భాగస్వామి అయి తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ పిలుపునిచ్చారు. షాపూర్‌నగర్‌లో పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సీపీఐ ఆధ్వర్యంలో షాపూర్‌నగర్‌లో గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ మాట్లాడుతూ, ప్రతి ఓటరు ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొని తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని కోరారు. ఎస్ఐఆర్ పేరుతో ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించాలని అన్నారు. బీఎల్వోలు అందజేసే ఎన్యూమరేషన్ ఫారాలను ప్రజలు సక్రమంగా నింపి సమర్పించాలని సూచించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో అర్హులైన ఓటర్ల హక్కులకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుత ఎస్ఐఆర్ విధానంపై సీపీఐకి పలు అభ్యంతరాలు ఉన్నాయని పేర్కొంటూ, ఈ ప్రక్రియ వల్ల కార్మికులు, పేదలు, బలహీన వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఓటు హక్కు పరిరక్షణకు అందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చైతన్యంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి కే. స్వామి, ఏఐటీయూసీ కార్యదర్శి బి. శ్రీనివాస్, అధ్యక్షుడు హరినాథ్ రావు, ప్రజానాట్యమండలి అధ్యక్షుడు బాబు, యువజన సంఘం నాయకులు వంశీ, కీర్తి, పార్టీ నాయకులు సుంకిరెడ్డి శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

