7tv focus : ప్రతి ఐపీఎల్ సీజన్ ముందు ‘సమీక్ష’ సమావేశం నిర్వహించే భారత క్రికెట్ నియంత్రణ మండలి ఈసారి మాత్రం వాయిదా వేసింది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15 గురువారం ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానులు, మీడియా హక్కులు కలిగిన సంస్థలు, ఆయా రాష్ట్రాల క్రికెట్ సంఘాల ప్రతినిధులు ఈ మీటింగ్ జరగాలి. కానీ, అనుకోకుండా ఆరోజు సమీక్ష సమావేశం లేదని బీసీసీఐ కబురు పంపింది. అయితే.. వాయిదాకు కారణాలు ఏంటీ? అనేది తెలియాల్సి ఉంది.ఐపీఎల్ 20వ సీజన్‌కు ముందు జరగాల్సిన సమీక్ష సమావేశం వాయిదా పడింది. ఈ విషయాన్ని పది జట్ల యజమానులకు, మీడియా రైట్స్ కలిగిన జియోస్టార్, స్టార్ స్పోర్ట్స్ సంస్థలకు, రాష్ట్ర క్రికెట్ సంఘాలకు బీసీసీఐ, ఐపీఎల్ పాలకమండలి తెలియజేశాయి. ‘షెడ్యూల్ ప్రకారం ఆక్టోబర్ 15 గురువారం సాయంత్రం 6 గంటలకు ఈ రివ్యూ మీటింగ్ ఉండాలి. కానీ ఈ రోజుల సమావేశం వాయిదా వేస్తున్నాం’ అని బీసీసీఐ నుంచి ఫ్రాంచైజీ యజమానులకు సందేశం వెళ్లింది. అదే సమయంలో కొత్త తేదీని కూడా వెల్లడించలేదు. దాంతో, అసలు ఏం జరిగి ఉంటుంది? అనేది ఆసక్తి రేపుతోంది.క్రిక్‌బజ్ కథనం ప్రకారం.. ఈ రివ్యూ మీటింగ్ వాయిదాకు ఓ కారణముంది. ఇటీవల జపాన్‌లోని ఐచీ నగోయలో ముగిసిన ఆసియా క్రీడల్లో పతకాలతో మెరిసిన భారత బృందానికి ప్రధాని నరేంద్ర మోడీ సన్మానం చేయనున్నారని సమాచారం. ‘అక్టోబర్ 15వ తేదీనే ఆసియా క్రీడల విజేతలకు ప్రధాని మోడీ సన్మానం చేయనున్నారు.

