7tv focus : స్పెన్షన్కు గురైన కర్నాటక పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మెన్ శివశంకరప్ప ఎస్ షౌకార్, కేపీఎస్సీ సభ్యురాలు బీవీ గీతలను ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. బెంగుళూరులోని డాలర్స్ కాలనీలో శివశంకరప్ప ఇంట్లో ఇవాళ ఈడీ సోదాలు నిర్వహించింది. కేపీఎస్సీ రిక్రూట్మెంట్ కేసులో సస్పెండ్ అయిన ఐఏఎస్ ఆఫీసర్, కేపీఎస్సీ మాజీ ఎగ్రామ్ కంట్రోలర్ జ్ఞానేంద్ర కుమార్ గంగావర్ను కస్టడీలోకి తీసుకుని విచారించిన విషయం తెలిసిందే. ఈ కేసులోనే రాజకీయ కార్యకర్త బసవరాజ్ కన్నాలేను కూడా ఈడీ విచారించింది. ప్రస్తుతం ఆ ఇద్దరూ బెంగుళూరులోని సెంట్రల్ జైలులో ఉన్నారు.మంగళవారం ఉదయం శివశంకరప్ప ఇంటికి చేరుకున్న ఈడీ అధికారులు ఆయన నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన్ను రాత్రి అదుపులోకి తీసుకున్నారు. డాలర్స్ కాలనీలో ఉన్న బీవీ గీతను మరో ఈడీ బృందం అదుపులోకి తీసుకున్నది. శివశంకరప్ప సమీప బంధువు, పరీక్షల్లో ఎక్కువ మార్కులు స్కోర్ చేసిన సుగురేశ్ అనే వ్యక్తి నుంచి ఈడీ స్టేట్మెంట్ తీసుకున్నది. సుగురేశ్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా శివశంకరప్పను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.జనవరి 8వ తేదీన పశువైద్య శాఖలో 400 ఆఫీసర్, గెజిటెడ్ పోస్టులకు జరిగిన పరీక్షలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రశ్నాపత్రాన్ని లీక్ చేయడం, ఆ తర్వాత ఉద్యోగం కోసం డబ్బులు, ఇంటర్వ్యూ సమయంలో లంచం డిమాండ్ చేసినట్లు ఈ కేసులో ఆరోపణలు ఉన్నాయి. అయితే పరీక్షకు ముందు రోజు రాత్రి శివశంకరప్ప ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అగ్రికల్చర్ ఇంజినీరింగ్లో డిగ్రీ కలిగి ఉన్న శివశంకరప్ప.. 2019లో కేపీఎస్సీ సభ్యుడిగా చేరారు. ఆ తర్వాత 2021లో చైర్మెన్ అయ్యారు.

