7tv focus : రక్షాబంధన్ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చిన్నారులతో కలిసి సరదాగా గడిపారు. ఢిల్లీలోని ప్రధాని అధికారిక నివాసం 7, లోక్ కళ్యాణ్ మార్గ్‌లో జరిగిన రాఖీ వేడుకల్లో చిన్నారులతో ముచ్చటిస్తూ ప్రత్యేకంగా సమయం కేటాయించారు. ఈ సందర్భంగా పిల్లలతో ప్రధాని మోదీ చేసిన సంభాషణ అందరినీ ఆకట్టుకుంటోంది.చిన్నారులతో మాట్లాడుతున్న సమయంలో వారు ప్రధాని మోదీకి ఓ ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. “మీరు చిన్నతనంలో ఎలాంటి కల కనేవారు?” అని అడిగారు. దీనికి ప్రధాని మోదీ చిరునవ్వుతో స్పందించారు. “మీ అందరినీ కలవాలనే కల ఉండేది” అంటూ సరదాగా జవాబిచ్చారు. ప్రధాని సమాధానానికి చిన్నారులు కూడా ఆనందంగా స్పందించారు.ఈ సందర్భంగా మోదీ పిల్లలతో చేతులు కలిపారు. వారితో కలిసి హై-ఫైవ్ చేస్తూ యువతరాన్ని తలపించేలా సందడి చేశారు. చిన్నారులతో ఆప్యాయంగా మాట్లాడిన ప్రధాని వారిని ఆశీర్వదించారు. రాఖీ పండుగ సందర్భంగా పిల్లలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.ఈ మధుర క్షణాలకు సంబంధించిన వీడియోను ప్రధాని మోదీ విడుదల చేశారు. చిన్నారులతో తన అనుబంధాన్ని చూపించే ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో అది ఆకట్టుకుంటోంది. పిల్లల అమాయక ప్రశ్నలకు మోదీ ఇచ్చిన సమాధానాలు, వారితో ఆయన గడిపిన సరదా క్షణాలు వీడియోలో కనిపిస్తున్నాయి.

