కేక్ కట్ చేసి సంబరాలు.. చేసుకున్న కాంగ్రెస్ నేతలు
7టీవీ ఫోకస్, చౌటుప్పల్, జూన్ 19: కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను చౌటుప్పల్లో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. మున్సిపాలిటీ అధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బోయ దేవేందర్ ఆధ్వర్యంలో లక్కారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడుతున్న నాయకుడు రాహుల్ గాంధీ అని కొనియాడారు. దేశ ప్రజల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని, ప్రజల పట్ల అంకితభావం, అభివృద్ధిపై దూరదృష్టి కలిగిన నాయకుడిగా రాహుల్ గాంధీ గుర్తింపు పొందారని పేర్కొన్నారు. దేశం మరింత అభివృద్ధి దిశగా పయనించాలంటే ఇలాంటి నాయకత్వం అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మునుగోడు ఎన్నికల ఇంచార్జ్ పబ్బు రాజు గౌడ్, వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ సుర్వి నరసింహ గౌడ్, సర్పంచులు, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

