7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూన్ 29: సాయిబాబా నగర్ డివిజన్లోని ఎస్.ఆర్. నాయక్ నగర్ జనప్రియ అపార్ట్‌మెంట్స్‌లో నెలకొన్న సీసీ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల సమస్యలను మేడ్చల్ జిల్లా ఫిషరీస్ చైర్మన్ మన్నె రాజు పరిశీలించారు. నివాసితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సాయిబాబా నగర్ డివిజన్ పరిధిలోని ఎస్.ఆర్. నాయక్ నగర్ జనప్రియ అపార్ట్‌మెంట్స్‌ను మేడ్చల్ జిల్లా ఫిషరీస్ చైర్మన్ మన్నె రాజు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ నివాసితులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అపార్ట్మెంట్ పరిసరాలను పరిశీలించిన ఆయన సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు డ్రైనేజీ, ఇతర మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలను పరిశీలించారు. ప్రజలు తెలిపిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి ఫోన్ ద్వారా తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందేలా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు భాస్కర్ రెడ్డి, జనప్రియ అపార్ట్మెంట్స్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

