7,న్యూస్, ఫోకస్,, అమరచింత మండల కేంద్రానికి ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్న స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా సేవలు మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి డీకే అరుణమ్మ గారి కృషితో రానున్నాయని బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి గారు విలేకరులకు తెలియజేసారు.గత రెండు నెలల క్రితం హైదరాబాద్ లోని SBI సెంట్రల్ కార్యాలయంలోని SBI సౌత్ ఇండియా AGM శ్రీ సునీల్ గోయెల్ గారిని అమరచింత పట్టణ బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి డాక్టర్ మంగా లావణ్య అంజి గారితో వెళ్లి కలిసి అమరచింత పట్టణ మరియు పరిసర ప్రాంతాలలోని వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు మరియు రైతులు పడుతున్న ఇబ్బందులను శ్రీ సునీల్ గోయెల్ గారి దృష్టికి తీసుకెళ్లగా, తక్షణమే స్పందించిన AGM గారు, మీ మండలకేంద్రానికి త్వరలోనే SBI బ్యాంకు మంజూరవుతుందని తెలియజేసారు.తరువాత మహబూబ్నగర్ లోని SBI జోగులాంబ గద్వాల డివిజన్ అధికారులు అమరచింత పట్టణం సైట్ విజిట్ చేయడం, వివరాలను సేకరించడం జరిగింది.ఈరోజు హైదరాబాద్ లోని SBI సెంట్రల్ కార్యాలయానికి శ్రీమతి మంగా లావణ్య గారు, శ్రీ మరాఠి అశోక్ గారు, శ్రీ నర్సింలు గౌడ్ గారు, శ్రీ మంగ అంజి గారు,శ్రీ కొంగరి భాస్కర్ గారు, శ్రీ ఫిరోజ్ రాజు గారు,శ్రీ సత్యేన్దర్ గారు,శ్రీ రవికుమార్ గారు, విలేకరి శ్రీ రఘు గారి తో కలిసి వెళ్లిన బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి గారు SBI AGM గారిని సంప్రదించగా మీ అమరచింతకు SBI బ్యాంకు మంజూరు అయిందని, రెండు, మూడు నెలలలో SBI సేవలు అందుబాటులోకి వస్తాయని తెలియజేసారు.అమరచింతకు SBI బ్యాంకు రావడానికి అహర్నిశలు కృషి చేసిన జేజమ్మకు శతకోటి వందనాలతో డాక్టర్ బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి, డాక్టర్ మంగా లావణ్య అంజి మరియి అమరచింత డెవలప్మెంట్ ఫోరమ్ సభ్యులు.

