బెంగుళూరు 7tv focus : జనతాదళ్ పార్టీ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్న.. ఓ రేప్ కేసులో జీవితకాల జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే బెంగుళూరు జైలులో ఉంటున్న అతని వద్ద ఫోన్ ఉన్నట్లు గుర్తించారు. క్రైం బ్రాంచ్ పోలీసులు ఆకస్మిక రెయిడ్ నిర్వహించారు. ఆ సమయంలో ప్రజ్వల్ రేవన్న వద్ద ఫోన్ ఉన్నట్లు తేల్చారు. క్రైం బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. జైలులోపలికి ఎలా అతను ఫోన్ తీసుకువచ్చాడన్న కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. ఈ కేసులో అధికారులు ఓ సీనియర్ జైలు ఆఫీసర్‌ను సస్పెండ్ చేశారు. విధులను నిర్లక్ష్యంగా నిర్వహిస్తున్నట్లు ఆరోపించారు. ప్రజ్వల్ రేవన్న సెల్లో లోపాలు ఉన్నట్లు పోలీసులు నోటీసు ఇచ్చారు. జైల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎర్రన్న రంగాపూర్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఇక ఇదే కేసులో జైలు సూపరింటెండెంట్ అన్షుచ్ కుమార్‌కు షోకాజు నోటీసు జారీ చేశారు. భద్రతా లోపం వల్ల వివరణ ఇవ్వాలని కోరారు.

