7tv focus : ఓ టిక్‌టాక్ వీడియో కారణంగా అరుదైన జాతికి చెందిన చేప ఒకటి వెలుగులోకి వచ్చింది. అచ్చం వానపాములా ఉండే చేపను సైంటిస్టులు గుర్తించారు. దానికి ‘గంగాఇచ్థిస్ ఇండోనేపాలికస్’ అని పేరు పెట్టారు. ఈ చేప మొదటి సారిగా 2024లో ఆన్లైన్లో దర్శనం ఇచ్చింది. ఇండియా, నేపాల్ సరిహద్దు ప్రాంతంలో ఓ వ్యక్తి దాన్ని వీడియో తీశాడు. ఆ వీడియోను టిక్‌టాక్‌లో షేర్ చేశాడు. వైరల్‌గా మారిన వీడియో సైంటిస్టుల దృష్టికి వెళ్లింది.బోర్వెల్ నీటినుంచి బయటపడ్డ ఆ చేపను మొదటి సారి చూసిన సైంటిస్టులు పొరపాటు పడ్డారు. చేపకు ఉండాల్సిన ఒక్క లక్షణం కూడా దానిలో లేకపోవటంతో.. అదొక సరికొత్త జీవి అనుకున్నారు. కానీ, పలు పరిశోధనల తర్వాత దాన్ని చేపగా గుర్తించారు. ముంబైలోని థాక్రే వైల్డ్ లైఫ్ ఫౌండేషన్‌కు చెందిన అంతర్జాతీయ సైంటిస్టుల బృందం, కోల్హాపూర్ యూనివర్శిటీకి చెందిన సైంటిస్టులతో పాటు మరి కొంతమంది ఆ జీవిపై పరిశోధనలు చేశారు.
సైంటిస్టులు మాట్లాడుతూ.. ‘విచిత్రమైన చేపను పట్టుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ చేపలు ఉన్న బోర్‌వెల్స్, బావులను గుర్తించటం.. వాటి యజమానుల నుంచి అనుమతులు తీసుకోవటం కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. మనుషుల సాయంతో నీళ్లను తోడాము. మొదటిసారి 2 వేల లీటర్ల నీళ్లను తోడి ఓ చేపను గుర్తించాము. అయితే, నీటిని తోడుతున్నపుడు గాయాలు అవ్వటం వల్ల అది కొద్దిసేపటికే చనిపోయింది. తర్వాత 500 లీటర్ల నీటిని తోడాము. అప్పుడు మరో చేప దొరికింది’..

