డ్రగ్స్ నిర్మూలనలో సైబరాబాద్ పోలీసుల పనితీరుకు డీజీపీ ప్రశంసలు
7 టీవీ ఫోకస్ సైబరాబాద్, జూలై 3:
రాష్ట్రంలోని అన్ని యూనిట్ల అధికారులు, పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోలతో రాష్ట్ర డీజీపీ సి వి ఆనంద్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి శాంతిభద్రతలు, నేర నియంత్రణ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, ప్రజలకు చేరువైన పోలీసింగ్‌పై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రమేష్ రెడ్డి సైబరాబాద్ కమిషనరేట్‌కు చెందిన డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఎస్‌హెచ్‌వోలు తదితర అధికారులు పాల్గొన్నారు.

అదేవిధంగా CCTNS, ఈ-సాక్ష్య (e-Sakshya) వంటి ఆధునిక సాంకేతిక వ్యవస్థలను పూర్తి స్థాయిలో అమలు చేసి, ప్రతి కేసులో డిజిటల్ ఆధారాలను సమర్థవంతంగా వినియోగించాలని డీజీపీ సూచించారు. సైబర్ నేరాల నియంత్రణ, మహిళలు, చిన్నారుల భద్రత, పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయడం, ప్రజలకు నాణ్యమైన పోలీసు సేవలు అందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు.వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా సైబరాబాద్ కమిషనర్ కమిషనరేట్ పరిధిలో అమలు చేస్తున్న ప్రత్యేక చర్యలు, డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టిన ఆపరేషన్లు, నేర నియంత్రణ చర్యలు, విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమాలపై వివరించారు. డ్రగ్స్ నిర్మూలనలో సైబరాబాద్ పోలీసులు సాధిస్తున్న ఫలితాలను డీజీపీ అభినందించారు.
ఈ సమావేశంలో కమిషనర్‌తో పాటు కమిషనరేట్‌కు చెందిన డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఎస్‌హెచ్‌వోలు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు..

