రూ.40 వేల లీటర్ల రక్షిత మంచినీటి పథకం ప్రారంభం
7టీవీ ఫోకస్, ఆంధ్రప్రదేశ్, ఏలూరు జిల్లా, జూలై 1: లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామంలోని తాతగారి కాలనీలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా 40 వేల లీటర్ల సామర్థ్యంతో నిర్మించిన రక్షిత మంచినీటి పథకాన్ని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా సుమారు 250 కుటుంబాలకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి రానుంది. ఏలూరు జిల్లా, లింగపాలెం మండలం, ధర్మాజీగూడెం గ్రామంలోని తాతగారి కాలనీలో నూతనంగా నిర్మించిన 40 వేల లీటర్ల సామర్థ్యం గల రక్షిత మంచినీటి పథకాన్ని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి కుటుంబానికి స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీటిని అందించడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు. 40 వేల లీటర్ల నిల్వ సామర్థ్యంతో నిర్మించిన ఈ పథకం ద్వారా తాతగారి కాలనీలోని సుమారు 250 కుటుంబాలకు నాణ్యమైన తాగునీరు నిరంతరం అందుబాటులో ఉంటుందని ఎమ్మెల్యే వివరించారు. గతంలో తీవ్ర తాగునీటి సమస్యను ఎదుర్కొన్న కాలనీవాసులకు ఈ పథకం శాశ్వత ఉపశమనం కలిగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో లింగపాలెం మండల ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామ పెద్దలు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

