7టీవీ ఫోకస్, కూకట్ పల్లి, జూన్ 27: ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని పీజేఆర్ నగర్లో రూ.2 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ పనులను మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించారు. నిర్మాణాన్ని నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆల్విన్ కాలనీ డివిజన్లోని ఎల్లమ్మబండ పరిధి పీజేఆర్ నగర్లో రూ.2 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పీజేఆర్ నగర్ వాసుల చిరకాల కోరికగా ఉన్న ఈ ఫంక్షన్ హాల్‌ను అన్ని హంగులు, సకల సౌకర్యాలతో నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పేద, మధ్యతరగతి కుటుంబాలతో పాటు పరిసర ప్రాంత ప్రజలకు ఈ ఫంక్షన్ హాల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. వివాహాలు, శుభకార్యాలు, సమావేశాలు, సామాజిక కార్యక్రమాలు, జన్మదిన వేడుకలు తదితర కార్యక్రమాల నిర్వహణకు ఇది అనువైన వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. అలాగే, ఫంక్షన్ హాల్‌తో పాటు నిర్మాణంలో ఉన్న చిన్నారుల పార్కు పనులను కూడా వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో శశిధర్ పట్వారీ, జి. రవి, యాదగిరి, అగ్రవాసు, వాలి నాగేశ్వరరావు, శ్రీను, రాజు తదితరులు పాల్గొన్నారు.

