పోలవరం 7 టివి ఫోకస్ జూలై 3జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల దరఖాస్తుల కార్యక్రమానికి పోలవరం నియోజకవర్గం నుంచి భారీగా తరలిన జనసైనికులు కార్లతో భారీ ర్యాలీ పోలవరంలో పెత్తందారీ రాజకీయాలకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందన్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు జనసేన పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల దరఖాస్తుల కార్యక్రమానికి పోలవరం నియోజకవర్గం నుంచి జనసైనికులు వీర మహిళలు పార్టీ నాయకులు యువత అభిమానులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు బర్రింకలపాడు క్యాంపు కార్యాలయం నుంచి జంగారెడ్డిగూడెం వై జంక్షన్ నుంచి ఏలూరు జిల్లా పార్టీ కార్యాలయం వరకు వందలాది కార్లతో భారీ ర్యాలీగా బయలుదేరిన జనసైనికులు జనసేన జెండాలను రెపరెపలాడిస్తూ పార్టీ నినాదాలతో ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించారు ర్యాలీ మొత్తం పార్టీ కార్యకర్తల ఐక్యత క్రమశిక్షణ సేవాభావానికి నిదర్శనంగా నిలిచింది ఈ సందర్భంగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ జనసేన పార్టీ వ్యక్తుల ఆధారంగా కాకుండా సిద్ధాంతాలు సేవా తత్వం ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగే రాజకీయ శక్తి అని అన్నారు గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం సమర్థవంతమైన నాయకత్వాన్ని గుర్తించడం ప్రజలకు మరింత చేరువయ్యే సంస్థాగత నిర్మాణాన్ని ఏర్పాటు చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు గుర్తింపు లభించే విధంగా జనసేన సంస్థాగత వ్యవస్థ రూపొందుతోందని కష్టపడే కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీ మరింత శక్తివంతంగా ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు అలాగే నేటితో పోలవరం నియోజకవర్గంలో పెత్తందారీ రాజకీయాలకు చెక్ పడుతోంది ఒకరిద్దరి ఆధిపత్యానికి కుటుంబ రాజకీయాలకు బెదిరింపుల రాజకీయాలకు ఇక ప్రజలు ముగింపు పలుకుతున్నారు కార్యకర్తే నాయకుడు అనే భావనతో జనసేన పార్టీ ముందుకు సాగుతోంది ప్రజలే మా బలం కార్యకర్తలే మా ఆస్తి ప్రజాస్వామ్య విలువలే మా సిద్ధాంతం ప్రతి గ్రామంలో ప్రజలతో కలిసి పనిచేస్తూ పారదర్శక రాజకీయాలకు జనసేన నాంది పలుకుతోంది రానున్న రోజుల్లో పోలవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ మరింత బలంగా నిలిచి ప్రజల ఆశయాలను నెరవేర్చే దిశగా కృషి చేస్తుంది అని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు స్పష్టం చేశారు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ముందంజలో ఉందని అభివృద్ధి మరియు సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకెళ్తోందని ఆయన పేర్కొన్నారు పోలవరం నియోజకవర్గంలో కూడా అభివృద్ధి పనులకు వేగం పెంచుతూ ప్రతి గ్రామానికి ప్రభుత్వ ఫలాలు అందేలా కృషి కొనసాగిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు నియోజకవర్గ మండల ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు వీర మహిళలు యువజన నాయకులు అనుబంధ విభాగాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో జనసైనికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

