7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూలై 6: ఇందిరాపార్క్ వద్ద వామపక్షాల ధర్నాలో కుత్బుల్లాపూర్ నుంచి భారీగా పాల్గొన్న సీపీఐ శ్రేణులు – హామీలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ఇ ళ్ల స్థలాలు లేని ప్రతి పేద కుటుంబానికి స్థలం, ఇల్లు లభించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని సీపీఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ అన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు, అర్హులకు ఇంటి పట్టాల పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సోమవారం ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి సీపీఐ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమా మహేష్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇళ్ల స్థలాలు, గృహాల నిర్మాణం పేరుతో రాజకీయ పార్టీలు హామీలు ఇస్తున్నప్పటికీ, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో విఫలమవుతున్నాయని విమర్శించారు. పేదలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా, ముఖ్యంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో వేలాది మంది పేదలు సొంత ఇల్లు, ఇంటి స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అర్హులైన వారందరినీ సమీకరించి ఇళ్ల స్థలాల సాధన కోసం పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి హరినాథ్రావు, జిల్లా కౌన్సిల్ సభ్యుడు నరసింహారెడ్డి, సీపీఐ నాయకులు కృష్ణ, వెంకటేష్, బక్కరి మల్లేష్, నాగేష్, ఇమామ్, నరసయ్య, ముసలయ్య, యాదగిరి, కొండయ్య, యువజన నాయకులు కీర్తి, ప్రవీణ్, మహేష్, వంశీ, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

