వంగవీటి మోహన రంగా జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు
జీలుగుమిల్లి 7 టివి ఫోకస్ జూలై 4

జీలుగుమిల్లి మండల కేంద్రంలోని స్వర్గీయ వంగవీటి మోహన రంగా విగ్రహానికి ఆయన 79వ జయంతి సందర్భంగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం రెండు నిమిషాల పాటు మౌనం పాటించి ఆయన సేవలను స్మరించుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడిన నాయకుడిగా వంగవీటి మోహన రంగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు పేదలు బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు ప్రజల పట్ల అంకితభావం ధైర్యసాహసాలు సేవా తత్పరత నేటి యువతకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు సమాజంలో ఐక్యత సామరస్యం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రజాసేవనే పరమావధిగా భావించి పనిచేయడం ద్వారానే మహనీయులకు నిజమైన నివాళి అర్పించినవారమవుతామని ఎమ్మెల్యే అన్నారు అనంతరం వంగవీటి మోహన రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు ఆయన సేవలను స్మరించుకున్నారు కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు రంగా ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బండారు అనిల్ రూపా సత్యనారాయణ శేఖముడి సాయి బాసిన రాజబాబు కక్కిరాల ఉపేంద్ర నాలి శ్రీనివాస్ కూరం వెంకటేష్ దేవుడు శ్రీను నేలటూరి మోహన్ యడ్లపల్లి శేషగిరి కోర్ల సత్యనారాయణ కోలా ధర్మరాజు కొత్తూరు రాజేష్ సిరిబత్తుల స్వామి సంకుల రామకృష్ణ కుంజా రమేష్ చిర్రి నాగరాజు రాయి సుబ్బారావు గుడేల్లి లక్ష్మీ నారాయణ తోట బాలు మద్దాల రమేష్ సొడెం రమేష్ కక్కిరాల శ్రీను జగదీష్ కొట్టే శాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు

